తెలుగులో…

సాయంకాలం ,

సముద్రం ఆకాశాన్ని  కలిసే చోట ఎర్రదనం 

నవ వధువు నుదుటి పై సింధూరం లా వుంది

నగరంలో విమానాలకు అలవాటు పడ్డ కనులు,

చుక్కలను అద్భుతంగా చూస్తున్నాయి…

వాహనాల మోత కు అలవాటు పడ్డ చెవులు,

పక్షుల కిలకిల రావాలతో మురుస్తున్నాయి…

ఒడ్డుకు చేరిన నత్తగుల్లలు,

          జ్ఞాపకాల గూడును కడుతున్నాయి…

తారు రోడ్డు లేదు!

అంతర్జాలం లేదు !

అయినా జీవితం ఆగలేదు!!!

మళ్ళీ , 

సొంత ఊరును మించిన జ్ఞాపకం లేదు 

స్నేహితులను మించిన మిఠాయి లేదు 

కనుక ఓ ప్రకృతి , 

       ఇంక సెలవు…

       నా ఉనికి నన్ను పిలుస్తోంది…..

Advertisements